SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా: ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల పెంపు అశాస్త్రీయంగా ఉందని CITU ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు విమర్శించారు.సిఐటియు పెనుబల్లి మండల కమిటీ సమావేశం చలమాల సూర్యనారాయణ భవనంలో గుడిమెట్ల బాబు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విట్టల్ రావు మాట్లాడుతూ, 14 ఏళ్ల తర్వాత వేతనాల సవరణ జరిగినా కార్మికుల డిమాండ్లు పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. మూడు జోన్ల విధానం, DA లెక్కింపు లోపాలపై కూడా CITU వ్యతిరేకత వ్యక్తం చేసింది.గత సిఫార్సుల ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికుడికి రూ.18,019 వేతనం ఉండగా, ప్రభుత్వం రూ.16,000 మాత్రమే ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు. శాస్త్రీయ లెక్కల ప్రకారం కనీస వేతనం రూ.32,000 ఉండాలని, కనీసం రూ.26,000కు సవరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే సలహామండలి సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వేతనాలను సవరించాలని CITU డిమాండ్ చేసింది.
ఈ సమావేశంలో CITU పెనుబల్లి మండలం నాయకులు తాండ్ర రాజేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు గాయం తిరుపతిరావు, తడకమల్ల చిరంజీవి, కంటే సత్యం, రైతు సంఘం మండల అధ్యక్షులు చిట్టి మొదల కృష్ణ, సిఐటియు నాయకులు చీప్ వెంకటేశ్వర్లు, మిద్దె స్వామి, కే. రవీంద్ర,ఎస్.కె చిన్న రాజి, అనప రెడ్డి లక్ష్మయ్య, కొప్పుల గోవిందరావు, మేకల బాజీ, జీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు…