SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పెనుబల్లి మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన ఓ రైతు సైబర్ మోసానికి గురవడంతో, తన బ్యాంక్ ఖాతా నుండి తెలియకుండా రూ.2,22,011 మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పొలం కౌలు చేసుకుంటూ కష్టపడి పని చేసి సంపాదించుకున్న డబ్బులు కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నాడు. పిల్లల కాలేజీ ఫీజు చెల్లించేందుకు 21వ తేదీ బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో కేవలం రూ.2,737 మాత్రమే ఉండటంతో రైతు దిగ్భ్రాంతికి గురయ్యాడు.
పెనుబల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో స్టేట్‌మెంట్ పరిశీలించగా మే 15 నుంచి 20 వరకు వివిధ UPI ఖాతాలకు దఫాదఫాలుగా డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. అనంతరం “SHAIL” పేరుతో వాట్సాప్ ద్వారా యింకా 57,300 రూపాయలు పంపితే, మొత్తం రీఫండ్ చేస్తామని మోసగాళ్లు మెసేజ్ చేయడంతో రైతుకు అనుమానం వచ్చింది.
దీంతో సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసి, అనంతరం లింగం బంజర్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.