SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) –
రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను పరిశీలించారు. రానున్న ఎన్నికలకు క్షేత్రస్థాయిలో అవగాహన ఉండాలని సెక్టర్ పోలీస్ ఆఫీసర్లకు సూచించారు.
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, పెండింగ్ కేసులు పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. పాత నేరస్ధుల కదలికలను నిఘా పెట్టాలన్నారు.