SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరులో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. సుమారు 200 మంది కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. కూలీలకు మెడికల్ కిట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి, స్వయంగా అల్పాహారం కూలీలకు వడ్డించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫకృద్దీన్, వేంసూరు తహసీల్దార్ ఎంపీడీఓ లతో కలిసి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. కూలీలతో ముఖాముఖి మాట్లాడి వారి పని విధానం, ఆరోగ్య సమస్యలు, బ్యాంక్ ఖాతాల్లో డబ్బుల జమకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కార మార్గాలను చూపారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందిస్తున్న ప్రజా రంజక పాలన, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అతి త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు, అలాగే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉపాధి హామీ కూలీలకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ (AMC) చైర్మన్ దోమ ఆనంద్ బాబు, గ్రామ సర్పంచ్ ఫక్రుద్దీన్, స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సోమిరెడ్డి, వేంసూరు గ్రామ ఉపసర్పంచ్, సీనియర్ నాయకులు దుగ్గిరాల అశోక్, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కందుకూరు సొసైటీ చైర్మన్ గొర్ల సంజీవరెడ్డి, వేంసూరు మండలం మరియు గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.