వేంసూరు మండలం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): కల్లూరు గూడెంలో ఇటీవల శంకుస్థాపన చేసిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన అనంతరం రైతులకు అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, మట్టా దయానంద్ దంపతులు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని సందర్శించి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం https://tv624-7news.in/ ను ఫాలో అవ్వండి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *