SPL6 LIVE NEWS (వెబ్ న్యూస్ – మే 13/26). తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ విఒఎల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు చేయాలని పిలుపునిచ్చింది. పెనుబల్లి మండలం విఒఎలు గత శుక్రవారం సమావేశం ఏర్పటు చేసుకొని, రాష్ట్ర కమింటి తీర్మానం మేరకు, ఖమ్మం జిల్లా విఒఎలు యూనియాన్ పిలుపుమేరకు తాము కూడా శాంతియుత నిరవధిశ సమ్మె నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వియం బంజర ఎస్ఐ వెంకటేశ్ కు వినతిపత్రం ద్వారా తెలియజేశారు.
సమ్మె ప్రారంభం: విఒఎలు సమ్మె నోటీసును సెర్ప్ సీఈఓకు అందజేయగా, మే 18 నుండి శాంతియుత పద్ధతిలో నిరవధిక సమ్మె ప్రారంభం కాబోతోంది.
ప్రధాన డిమాండ్లు: వీఓఏల కనీస వేతనాన్ని రూ.20,000 కు పెంచడం, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ఏ (HRA) వర్తింపజేయడం , అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించడం.
ఇతర డిమాండ్లు: రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించడం మరియు 58 జీవోను సవరించడం వంటివి వీఓఏలు ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి.