SPL6 LIVE NEWS (వెబ్ న్యూస్ – మే 12/26).జారె ఆదినారాయణ ప్రత్యేక కృషితో అశ్వారావుపేట మండల గ్రామీణ ప్రజలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు అశ్వారావుపేట బస్ డిపోలో కొత్తగూడెం, అశ్వారావుపేట నూతన బస్ సర్వీస్‌ను ఎమ్మెల్యే జార ఆదినారాయణ ఘనంగా ప్రారంభించారు.

ఈ సర్వీస్ ములకలపల్లి, జగన్నాధపురం, గండిముత్యాలమ్మ ఆలయ ప్రాంతం మీదుగా రెడ్డిగూడెం, తిరుమలకుంట, వినాయకపురం వైపుగా ప్రయాణిస్తూ మండలంలోని పలు గ్రామపంచాయతీల ప్రజలకు జిల్లా కేంద్రానికి చేరుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా మారనుంది.ఈ బస్ ఉదయం 7:30 గంటలకు అశ్వారావుపేట నుంచి బయలుదేరి 9:40 గంటలకు కొత్తగూడెం చేరుకోనుంది తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4:30 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి 6:20 గంటలకు అశ్వారావుపేట చేరుకుంటుంది అదేవిధంగా సత్తుపల్లి డిపో నుంచి భద్రాచలం వరకు మరో నూతన పల్లెవెలుగు సర్వీస్‌ను కూడా ప్రారంభించారు.

ఈ బస్ సర్వీస్ ములకలపల్లి, పొగళ్లపల్లి, తిమ్మంపేట మీదుగా భద్రాచలం చేరుకుని తిరిగి సత్తుపల్లికి ప్రయాణించనుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం సులభంగా ప్రయాణించే అవకాశం కల్పించడమే ఈ కొత్త బస్ సర్వీసుల ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెండు డిపోల మేనేజర్లు రాజ్యలక్ష్మి , లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ విజయ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, జారె అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *