SPL6 LIVE NEWS ( వెబ్ న్యూస్).ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా వారు న్యాయ రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన జస్టిస్ చంద్రయ్య సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అంశాలపై అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
వారి మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటు అని, జస్టిస్ చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.