నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని రక్షించేందుకు బోరు గుంతలోకి దిగిన తాత వెంకన్న(53) ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తాతా, మనవడిని ఇద్దరినీ బయటకు తీశారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *