SPL6 LIVE NEWS ( వెబ్ న్యూస్). ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీభూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయి, రెండు విభాగాలు కలిసి జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫారెస్టు అధికారాలకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్టు మధ్య కూడా వివాదాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన రోవర్స్ తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఫారెస్ట్, రెవెన్యూ అధికారులను కోరారు.