SPL6 LIVE NEWS (వెబ్ న్యూస్). బండి సంజయ్ కుమారుడు భగీరథను అరెస్టు విషయంలో రెండు రకాల స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి.

బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని నార్సింగిలోని పోలీస్‌ అకాడమీ దగ్గర పోలీసుల స్వయంగా పట్టుకుని భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు పోలీసులు తరలించారు. సైబరాబాద్ సీపీరమేష్ రెడ్డి వివరించారు.

చట్టంపై గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించాం. అతడు తప్పు చేయలేదని చెబుతున్నాడు అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాడు. అందుకే భగీరథను పోలీసులకు అప్పజప్పటంలో ఆలస్యం జరిగింది. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందని బండి సంజయ్‌ వివరిస్తున్నారు.

పోక్సో కేసు నమోదైన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో భగీరథ్ ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే సిట్ అధికారులు అతని వివిధ కోణాల్లో ప్రశ్నించారు. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భగీరథ్ ను రిమాండ్ కు తరలించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *