SPL6 LIVE NEWS (డిజిటల్ న్యూస్). ఖమ్మం జిల్లా వైరాలో ఘనంగా జరిగిన మహిళా సమాఖ్య 22వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బత్తినేని నీరజ, ప్రధాన కార్యదర్శి ఏపూరి లతాదేవి తెలిపారు.
మహిళా సమాఖ్య 22వ జిల్లా మహాసభలో 14 తీర్మానాలు ఆమోదించినట్లు నీరజ, లతాదేవి వెల్లడించారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రో ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. మహిళా సమాఖ్య 22వ మహాసభలో 72 మందితో జిల్లా కౌన్సిల్, 22 మందితో కార్యనిర్వహక వర్గాన్ని ఎన్నుకున్నట్లు నీరజ, లతాదేవి తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు పోటు కళావతి, నాయకులు సిహెచ్ సీతా మహాలక్ష్మి, దండి శ్రీజ, మహిళా సమాఖ్య నిర్మాణ బాధ్యులు దొండపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.