TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, జూలై 24: న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో సంస్థల అధినేత డాక్టర్ సురేష్ రామాల జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులలకు, ఆర్టీసీ కార్మికుల కోరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, చెవి–ముక్కు–గొంతు (ఈఎన్‌టీ) పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే సత్తుపల్లికి చెందిన 100 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా రూ.4 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి బుధవారం ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు డాక్టర్ సురేష్ రామాల తన సొంత ఖర్చులతో యూనిఫాంలను అందజేశారు. విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలను సత్తుపల్లి ప్రజలకు స్థానికంగానే అందించాలనే లక్ష్యంతో న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందితో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *