SPL6 LIVE NEWS (డిజిటల్ న్యూస్). ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన నిందితుడు కడలి చంద్రశేఖర్(23)ను ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అరెస్టు చేశారు. యూట్యూబ్ ప్రకటనల ద్వారా సోషల్ మీడియా గ్రూపుల్లో పరిచయం పెంచుకొని అధిక లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుంచి లక్షల రూపాయలు పెట్టుబడుల పేరుతో వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి.ఎస్పీ, సిహెచ్ఆర్వి ఫణిందర్ ని, టాస్క్ లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి రవి కుమార్ , ఎస్సై లు రoజిత్ కుమార్, విజయకుమార్ లను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ,కానిస్టేబుల్ భాను మూర్తి , సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బందిని ఖమ్మం సిపి సునీల్ దత్, ఐపిఎసస్ అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *