SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో స్పందించారు. “చట్టం ముందు అందరూ సమానమే. విచారణకు సహకరించేందుకే నా కుమారుడిని పోలీసులకు అప్పగించాను” అని తెలిపారు.
అలాగే మాజీ సీఎం కెసిఆర్ అతని కుమార్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడని ఆరోపించారు. నా కన్న కొడుకుని సైతం పోలీసులకు అప్పచెప్పిని వ్యక్తిని నేను, అటువంటి నన్ను పార్టీ నుంచి భర్తరాఫ్ చేస్తారని కెసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. నాకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని మీడియా ముఖంగా బండి సంజయ్ తెలియజేశారు.
బీజేపీ కార్యకర్తలు దేశభక్తి, క్రమశిక్షణతో పనిచేసే సిపాయిలని, అటువంటి బీజేపీ కార్యకర్తల “చివరి కోరిక తమ పార్థివ దేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారు” అని భావోద్వేగంతో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.