టివి సిక్స్ ట్వంటి ఫోర్ బై సెవెన్ న్యూస్ కు స్వాగతం.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వియం బంజర్ బస్టాండ్ ప్రాంగణంలో గత 30 రోజులుగా పెనుబల్లి మండల కాకతీయ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో సుమారు 4వేల లీటర్ల మజ్జిగను ప్రయాణికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మజ్జిగ పంపిణీకి సహకరిస్తున్న కమ్మ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఎండలు ఇలాగే కొనసాగితే మరి కొంతకాలం మజ్జిగ పంపిణీ చేస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు.