TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఐకేపీ, వీఒఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెనుబల్లి మండలంలో పనిచేస్తున్న ఐకేపీ వివోఏ సిబంది చెప్పట్టిన ధర్నా 10వ రోజుకు చేరిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న వివోఏలకు సంఘీభావం తెలియ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఏ ఉద్యోగి కూడా ప్రశాంతత లేదని తెలియజేశారు. విఓఏ సిబందికి రాష్ట్ర వ్యాప్తంగా కనీసవేతనం 20000 ఇవ్వాలని డిమెండ్ చేసారు. ఉద్యోగ భద్రత కల్పించాలి. HR పాలసీ వర్తింప చేయాలి. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. 58 జిఓ ను సవరించాలి. అర్హులైన వివోఏ లను సీసీ లుగా ప్రమోట్ చేయాలని. ప్రతి ఒక్కరికి ట్యాబ్ సాకర్యం కల్పించాలని. గౌరవవేతనం విఓఎల హక్కుఅని కనీస వేతనం కావాలని డిమెండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మందాడపు అశోక్ కుమార్, కోట ప్రభాకర్, టీవీ రామారావు, sk గౌస్, పసుమర్తి వెంకటేశ్వరావు, బెల్లంకొండా చలపతిరావు, చక్కిలాల లక్ష్మణ్ రావు, కోమటి ప్రసాద్, తవునాయాక్, కొప్పుల గోవిందరావు, ఎటుకూరి సత్యం బాబు, వంగ చిన్న పండు, వేముల బాబురావు వేముల సురేష్, వంకోడత్ మురళి, రాజబాబు, మరకాల చంటి, మరకాల వెంకీ, వర్ధబోయిన నాగేశ్వరావు, మల్లది రవి, గునగంటి లక్ష్మినారాయణ తదితరులు పాల్గోన్నారు.