TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం. 2023 మే 28 న నిందితుడైన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల పాపను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి టివి సౌండ్ ఎక్కువ పెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 279/2023.SC.పొక్సో .40/2023 U/S 323 354 (A)(B) 506 IPC సెక్షన్ 8 ఆఫ్ పొక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేశారు.

అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా కేసును పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడి పై మోపిన నేరం రుజువు కావడంతో బుధవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదించారు. విచారణ అధికారులు ఎస్సై వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం. వెంకయ్య , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోం గార్డ్ చిట్టిబాబు ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *