SPL6 LIVE NEWS(డిజిటల్ మీడియా నెట్వర్క్) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో 16 రోజుల బాలింత మృతి చెందింది. రేగళ్లపాడు గ్రామానికి చెందిన మారుతి రాములమ్మ అనే మహిళ కాన్పు కోరకు మే 12వ తేదీన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయడంతో బంగారం లాంటి బాబుకు జన్మనిచ్చింది. హాస్పటల్లో వారం రోజులు వైద్యం అందించిన తర్వాత రాములమ్మను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
గురువారం రాములమ్మకు అధిక రక్తస్రావం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములమ్మను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించింది అని ధ్రువీకరించారు. రాములమ్మ మృతితో రేగళ్లపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. రాములమ్మకు అధిక రక్తస్రావం కావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.