TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో విఒఎలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేటికి 12వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఎంపిడిఒ కార్యాలయం ప్రాంగణం నుండి విఎం బంజర్ రింగ్ సెంటర్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు మండుటెండలో ర్యాలీ నిర్వహించారు. వీరికి సిపిఎం పార్టీ నాయకులు గాయం తిరుపతిరావు, మాలమహానాడు జాతీయ కార్యదర్శి మేకతోటి కాంతయ్య, రైతు సంఘం నాయకులు నల్లమల ప్రతాప్ సంఘీభావం తెలియచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *