TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షురాలిగా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన కోమటి జ్యోతి కృష్ణారావును నియమించినట్లు జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు వడ్డెల్లి సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కోమటి జ్యోతి కృష్ణారావుకు, సహకరించాలని సాంబశివరావు కోరారు.

ఈ సందర్భంగా కామెంట్ జ్యోతి కృష్ణారావు మాట్లాడుతూ…… అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కష్టపడి పనిచేసి, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గం లోని నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తమకు సహకరించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *