TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
సింగరేణి కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బాల్క సుమన్‌పై పలు సెక్షన్లు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలు, న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా, పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, తన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని బాల్క సుమన్ ఆరోపించారు. తాను చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *