TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

➡️ సత్తుపల్లి పట్టణం, బస్టాండ్ రింగ్ సెంటర్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమర వీరులకు నివాళులు అర్పించి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన .. ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ చైర్మన్ రెహన బేగం. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో, రాష్ట్రoలో తెలంగాణ కోసం పోరాడిన వీరులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన .. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.



ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ 17 మంది, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, తెలంగాణ ఉద్యమకారులు, సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *