TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా విశేష సేవా కార్యక్రమం నిర్వహించారు. గత మూడు రోజులుగా మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో విస్తృతంగా పర్యటించిన ట్రస్ట్ ప్రతినిధులు ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి 320 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.32 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న సమయంలో ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు గ్రామ గ్రామాన కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక బాధ్యతతో చేపడుతున్న ఈ కార్యక్రమాలు పేద, బలహీన వర్గాల కుటుంబాలకు భరోసానిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.