TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన శ్రీ పంది వెంకటేశ్వరరావుకి పెనుబల్లి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పంది వెంకటేశ్వరావు మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ఆశీస్సులతో పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, గెలుపుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దతంపతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ తమ సహాయ సహకారాలు అందించాలని పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *