TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో అడుగు పడింది. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో భాగంగా కల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8మంది అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చేశారు.

ఇళ్ల పట్టాలు పొందిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే రాగమయి దయానంద దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *