TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ అమరజీవి స్వర్గీయ పొట్టి శ్రీరాములు భాష ప్రయుక్త రాష్ట్రాంగా ఏర్పాటులో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలప్పించారని అన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు, రాజకీయ వివాదాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘనంగా పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు దీక్ష స్ఫూర్తిని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని క్రింది వీడియోలో వీక్షిద్దాం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *