అశ్వారావుపేట, జూన్ 08 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో శుభకార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రజలను కలిశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం పట్వారిగూడెం వారపు సంతను సందర్శించి వ్యాపారులు, రైతులు, కొనుగోలుదారులతో ముచ్చటించారు. సంతలోనే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి సామాన్య ప్రజలతో కలిసి కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.