పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రాముఖ్యతను వివరించారు. తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను వివరించి విద్యార్థుల చేరికలను పెంచేందుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.