కొత్తగూడెం టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): కొత్తగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పాల్గొని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే రాబోయే ఎన్నికల్లో విజయానికి కీలకమని అన్నారు. ప్రతి బీఎల్ఏ ఒక సైనికుడిలా పనిచేసి దొంగ ఓట్లు, ప్రలోభాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి ప్రక్రియలను ఫారం-6, 7, 8 ద్వారా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. BLOలతో సమన్వయం చేసుకుని బూత్‌లలో 100 శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, వారికి ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.