TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వైరా, జూన్ 14. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ ఇసుక రీచ్ నుంచి ఎలాంటి పర్మిట్లు, చలానాలు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, చల్లమల్ల సుమంత్ కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను అరెస్ట్ చేసి, మహీంద్రా థార్ కారు, అశోక్ లేలాండ్ లారి, టిప్పర్, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక వ్యాపారంపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు.