TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కొనిజర్ల మండలం, జూన్ 15 – కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కేజీల గంజాయి పట్టుకొని, ఐదుగురు నిందుతులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపారు.

వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసుల ఆధ్వర్యంలో కొణిజర్ల లోని హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన, సత్యసాయి ఫౌండరీ, పల్లిపాడు ఎదురుగా శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా వైరా వైపు నుండి ఖమ్మం వెళ్తున్న ఒక బోలెరో వాహనం TG 17 T 1992 నంబరు గల దానికి పైలెట్ గా వస్తున్న మారుతీ డిజైర్ కార్ నెంబర్ TS 17 U 1941 కారు అనుమానస్పదంగా వున్నట్లు గుర్తించి వాహనాలు తనిఖీ చేయగా ఐదుగురు వ్యక్తులు వాహనంలో ఆక్రమముగా ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగినది.

ఆ వ్యక్తులను విచారించగా 1) అమూల్ నానోబా గోరే, వయస్సు 35 సం,, వడునాగనాద్ గ్రామం, చకూర్ మండలం, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర.
2) వసంత జాధవ్, 40 సం, కోతవాడి తండా, బాన్సువాడ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, 3) లక్ష్మణ్ నాగనాథ్ కరే, 26 సం,, చకూర్ గ్రామం, చకూర్ మండలం, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. 4) షేక్ ఆన్సర్ 30, దుబ్బ గ్రామం, తాడ్కోలు పంచాయితీ, బాన్సువాడ మండలం, కామారెడ్డి జిల్లా. 5) షేక్ రహ్మత్ 32సం,,దుబ్బ గ్రామం, తాడ్కోలు పంచాయితీ, బాన్సువాడ మండలం, కామారెడ్డి జిల్లా చెందిన వారుగా గుర్తించారు.

నిందుతుల వద్ద నుండి 201.45 ఎండు గంజాయిని దాని విలువ 1,00,50,000/-, 7 సెల్ ఫోన్ లను, నగదు 2800/-, ఒక మారుతీ డిజైర్ కార్, ఒక బోలెరో వాహనాన్ని స్వాదీనపర్చుకొని రిమాండ్ నిమిత్తము కోర్టు కు పంపనైనది. గంజాయి సప్లయర్, రిసీవర్ లు పరారీలో వున్నారని ఎస్సై సూరజ్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *