TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్ 14. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ కార్యక్రమం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ వేదికపై సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సత్తుపల్లి, కల్లూరు పట్టణ అధ్యక్షులకు అధికారిక నియామపత్రం అందించారు. సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడిగా గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులగా పంది వెంకటేశ్వర రావు, కల్లూరు మండలం అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భూడుగునూరి లక్ష్మా రెడ్డిని నియమించారు.

నూతనంగా నియమించబడిన అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *