TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 16. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చలమాల సూర్యనారాయణ భవన్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయి శేషు మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నియోజకవర్గంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కన్నా ముందే ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.

నోటు పుస్తకాలను పాఠశాలలోనే అమ్మడం నిషిద్ధం అని తెలిసిన కొన్ని కార్పొరేట్ పాఠశాలలు సత్తుపల్లి నియోజకవర్గంలో యదేచ్చగా విద్యతో వ్యాపారం చేస్తున్నాయని అట్టి కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, ఎర్రబడి ప్రవీణ్, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *