TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ములకలపల్లి మండలం, జూన్ 17. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగంగారం గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం వద్ద వరద నీటి సమస్య పరిష్కారానికి రూ.31.6 లక్షలతో నిర్మించనున్న గైడ్‌వాల్ పనులకు, జగన్నాధపురంలో మహిళా సంఘాల కోసం రూ.20 లక్షలతో నిర్మించనున్న వీవో భవనాలకు శంకుస్థాపన చేశారు.

జగన్నాధపురం, ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా పార్టీ పుస్తకాల పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఇష్టపడి చదువుకొని మంచి ఫలితాలతో పాస్ అవ్వాలని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని కోరారు.

మూకమామిడి–ఎర్రప్పగుంపు–రంగాపురం మార్గంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశార, 47 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జార ఆదినారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *