కల్లూరు మండలం, జూన్ 6 (TV6 24/7 NEWS): న్యూస్ కు స్వాగతం. ఇటీవల రైతులకు అధికారులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేశారు. దీనిలో భాగంగా కల్లూరు మండలం ఎర్ర బంజర గ్రామ రైతులకు కూడా కల్లూరు మండల కేంద్రంలో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులను ఎకరాకు 4500 రూపాయల ఖర్చు చేసి తీసుకువెళ్లారు. అయితే రైతులకు తీసుకెళ్లిన జిలుగులు పుచ్చిపోయాయని అవి పొలంలో చల్లితే మొలవడం లేదని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు.