కల్లూరు, జూన్ 7 (TV6 24/7 NEWS): గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్లూరు డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. ఇళ్లకు తాళాలు సరిగా వేయడం, నగదు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరచడం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కి డైలాగ్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాల నివారణ కోసం ప్రత్యేక నైట్ పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్, నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని ఏసీపీ వసుంధర యాదవ్ ప్రజలకు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *