వెబ్ న్యూస్ – మే 15/26. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పల్ చిలక గ్రామానికి చెందిన చిల్లిముంత కుటుంబరావు అనే వ్యక్తి 10వ తేదీ అదే గ్రామానికి చెందిన ఓరుగంటి వీర్రాజు అనే రైతు గొర్రెలకు కాపలాగా వెళ్ళిండు ఉప్పలచలక కొత్తచెరువు సమీపంలో గొర్రెలు కాపలా కాస్తున్న సమావేశంలో రెండు పొట్టేళ్లు పొడుచుకుంటూ ఉండగా వాటిని విడదీసే ప్రయత్నం చేశాడు.
కోపంతో ఉన్న పోటీళ్ళు కుటుంబరావు పై దాడి చేయడంతో కుటుంబరావు గాయాల పాలయ్యాడు. అయితే ఆ సమీపంలో పశువుల కాస్తున్న మహిళ ఆలస్యంగా చూసింది. ఆ మహిళ కుటుంబరావు బంధువులకు సమాచారం అందించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
అప్పటికే గాయాలతో బాధపడుతున్న కుటుంబరావుబంధువులు 108కు సమాచారం అందించగా,సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గాయాలతో ఉన్న కుటుంబరావును హుటాహుటిన పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 14వ తేదీ రాత్రి మరణించాడు. కుటుంబరావు మృతదేహాన్ని 15వ తారీకు రాత్రి 9 గంటలకు పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.