SPL6 LIVE NEWS ( వెబ్ న్యూస్).జూన్ 2, రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అదిలాబాద్ జిల్లా నుండి రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిశుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు, హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశంలో తెలియజేశారు.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరును విజయవంతంగా పూర్తి చేసి లక్షలాది పేద కుటుంబాల సొంత ఇంటి కలలను నెరవేర్చాం. 3 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ కాగా, ఇందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయని, అలాగే మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని మరో రెండు నెలల్లో పూర్తి అవుతాయని మంత్రి పొంగులేటి తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2,3,4 విడతల్లో కూడ అందిస్తామని, రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ఉండకూడదనే లక్ష్యంగా ఈపథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.