ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ నమోదు కార్యక్రమం త్వరలో జరుగుతుందని గ్రామస్థాయి నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో బిఎల్ఓ లు దగ్గర ఉన్నటువంటి ఓటర్ల జాబితా పరిశీలించి ఓటర్లు మార్పులు చేర్పులు విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య అన్నారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ…… ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ నమోదు కార్యక్రమం త్వరలో జరుగుతుందని, గ్రామస్థాయి నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో బిఎల్ఓ లు దగ్గర ఉన్నటువంటి ఓటర్ల జాబితా పరిశీలించి ఓటర్లు మార్పులు చేర్పులు విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
డబల్ ఓట్లు పేరున్న ఓట్లు, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, తొలగించడం జరుగుతుందని, ఎక్కడైనా రాష్ట్రంలోఒక వ్యక్తి ఒకచోట మాత్రమే ఓటు వినియోగించుకునే విధంగా ఉండేలా అధికారులు చూడాలని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి ఓటర్ల జాబితా పరిశీలించి మార్పులు చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు.
