SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పర్యావరణ కాలుష్యం బట్టీలలో రబ్బరు టైర్లు, ప్లాస్టిక్, ముఖ్యంగా బొగ్గు, కట్టెలు వంటివి కాల్చడం వలన కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు విడుదలై గాలిలో కలుస్తాయి. ఈ విషవాయువులు పీల్చుతున్న సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది కంటికి కనిపించని ప్రమాదకరమైన సామాజిక సమస్య. ఈ విషవాయువుల ప్రభావం గాలి వీసే వేగాన్ని బట్టి 500 మీటర్ల నుంచి 3 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.
గ్లోబల్ వార్మింగ్ :- బట్టీల నుండి వెలువడే దట్టమైన బ్లాక్ కార్బన్ గా పిలవబడే పొగ వలన వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ అధికమైన ఉష్ణోగ్రతలకు బట్టీల సమీపంలో నివసించే ప్రజలు ఉక్కపోతకు గురై వారి జీవన విధానం ముఖ్యంగా వేసవికాలంలో అతలాకుతలం అవుతుంది.
పచ్చని చెట్లు నరికివేత :- ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే మరో ప్రధాన ఇంధనం చెట్ల కలప. పచ్చి ఇటుకలను కాల్చే క్రమంలో ఇంధనంగా పెద్ద ఎత్తున చెట్ల కలపను ఉపయోగిస్తున్నారు. దీని వలన చెట్లు అంతరించిపోతున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాకుండా బట్టీల నుండి వెలువడే వ్యర్ధాల వలన చుట్టుపక్కల ఉన్న పొలాలపై, ఉన్న పంటల మొక్కలలో సరైన కిరణజన్య సంయోగ క్రియ జరగక, దాని ప్రభావంతో పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చెరువులకు ముంచుకొస్తున్న ప్రమాదం : ఇటుకల తయారీలో ఉచితంగా దొరికే రేగడి మట్టి చెరువుల నుంచి సేకరిస్తారు. ఆ చెరువులలో మట్టి మాఫియా కనీస నియమ నిబంధనలు ప్రమాణాలు పాటించకుండా, విచక్షణారహితంగా ఎక్కడపడితే అక్కడ భారీ గుంటలు ఏర్పాటు చేస్తారు. దీంతో చెరువు ఎఫ్ టి ఎల్ పెరిగి చెరువు కట్టలు తెగిపోతే ఆయకట్టులో ఉన్న పంటకు జరిగే నష్టాన్ని ఎంత ?
ఆరోగ్య సమస్యలు: బట్టీల నుండి వచ్చే పొగ, ధూళి పీల్చడం వలనవ స్థానిక ప్రజలకు, అక్కడ పనిచేసే కార్మికులకు, వారి పిల్లలకు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. గాలిలో కలిసే బూడిద రేణుల వల్ల కళ్ల మంటలు, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కార్మికులకు
మౌళిక సదుపాయాలు కరువు :- ఇటుక బట్టీలలో తయారీలో పేద కుటుంబాల వారిని, బయట రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుని వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో బట్టి యజమానులు విఫలమవుతున్నారు. కొంతమంది యజమానులు బాల కార్మికులను ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనుల్లో పెట్టుకుంటారు. తక్కువ వేతనాలు, కనీస రక్షణ పరికరాలు లేకపోవడం అపరిశుభ్రమైన వాతావరణం వల్ల కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. ఈ బట్టీలలో పనిచేసే కార్మికులకు అందించే కరెంటుకు విషయంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించరు.