TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి, మే 30 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో పేద మహిళలకు “ఇందిరా మహిళా శక్తి” చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులకు చెందిన పేద కుటుంబాల మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ… మహిళలు సమాజంలో ఒక గొప్ప శక్తిగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన డ్వాక్రా (SHG) మహిళల కార్యక్రమాలు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలపై ఆమె మహిళలకు పూర్తి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్, AMC చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత పాల్గొన్నారు. అలాగే మహిళా కౌన్సిలర్లు తోట సుజాల రాణి, విరివాడ అపర్ణ, దేవ జ్యోతి, కర్నాటి విజయలక్ష్మి, ఉప్పు నాగమణి, నసీమ షరీఫ్ మరియు నాయకులు మట్టా ప్రసాద్, జగ్గానాధం శ్రీను, దేవి స్వీట్ శ్రీను, మందపాటి ప్రభాకర్ రెడ్డి, శరత్ చంద్ర, హకీమ్, గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు. వీరితో పాటు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, కమల్ పాషా, పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, మున్సిపల్ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల (మహిళా, యూత్, NSUI) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.