ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ కేంద్రంలో 16వ డివిజన్ లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తామని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పాటు, అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి అని, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారధ్యంలో ఖమ్మం నియోజకవర్గం ప్రగతి పథంలో నడుస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, ఖమ్మం నగర డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గోన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *