SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). భగీరథ్ కేసులో ఇప్పుడు అత్యంత కీలక అంశంగా బాధితురాలి వయస్సు మారింది. ఆమె మైనరా? మేజరా? అన్న ప్రశ్నకే కేసు దిశ ఆధారపడుతోంది. ఒకవేళ బాధితురాలు మైనర్ అని తేలితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తప్పవు. అదే మేజర్ అని నిరూపితమైతే పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారంగా పరిగణించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సిట్ అధికారులు పాఠశాల రికార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుట్టిన తేదీల వివరాలపై కూడా లోతైన విచారణ కొనసాగుతోంది. రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
చట్టం ప్రకారం మైనర్ల విషయంలో అంగీకారానికి విలువ ఉండదు. అందుకే బాధితురాలి వయస్సుపై వచ్చే తుది నివేదికే భగీరథ్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారింది.