SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దినసరి అనసూయ (సీతక్క), కలిసి పర్యటించిన డిప్యూటీ సీఎం వెంకటాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 కోట్ల 84 లక్షలతో ఏర్పాటు చేసిన 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ….. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, టర్మరిక్ యూనిట్లు వంటి పెద్ద వ్యాపారాల్లో మహిళా సంఘా లను భాగస్వామ్యంచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని భట్టి విక్రమార్క అన్నారు. ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తామని ప్రకటించగా, తొలి రెండున్నరేళ్లలోనే రూ.66 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశామని తెలిపారు.

మహిళా సంఘాలకు తక్కువ ధరకు భూములు కేటాయించి, సాంకేతిక సహకారం అందిస్తూ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేపడుతున్నామని, మండలంలోని అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి, దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ మండలంలోని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చైతన్య మండల సమాఖ్య సభ్యులకు 10 కోట్ల 45 చెక్కును డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అందజేశారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ…. మహిళా సంఘాల ద్వారా రూ.3 కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టు విజయవంతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సోలార్ ప్లాంట్ నిర్వహణపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టికి వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం టర్మరిక్ బాయిలర్ యూనిట్‌లను, ఎర్రుపాలెం మండలంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసి,

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్త్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *