ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మండల పరిధిలోని కొత్త కారాయగూడెంకి చెందిన జోనబోయిన ముత్తయ్య (50 సం) లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నాడు. ఇటీవల వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైన ముత్తయ్య ఉప్పలచలకలోని తమ బంధువుల ఇంటి వెళ్లాడు. అస్వస్థతకు ముత్తయ్య శనివారం ప్రాణాలు కోల్పోయాడు.
కల్లూరు మండలం ఖాన్ ఖాన్ పేటకు చెందిన కమ్మం పాటి యేసు వడదెబ్బకు గురై మృతి చెందగా, తల్లాడ మండలం గాంధీనగర్ తండాకు చెందిన మాలోతి కృష్ణ కూడా వడదెబ్బకు గురై మృతి చెందాడు. సత్తుపల్లి నియోజకవర్గంలో వడదెబ్బకు గురై మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.