TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మేడేపల్లి గ్రామ శివారులో ఆకస్మికంగా పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సమయంలో నగదుతో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ.7,500/- నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న పోలీసులు.
ఈ సందర్భంగా శ్రీమతి వసుందర యాదవ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కల్లూరు సబ్ డివిజన్ మాట్లాడుతూ…. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాలు, శివారు ప్రాంతాల్లో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఏసీపి వసుంధర యాదవ్ ప్రజలను కోరారు.