కల్లూరు మండలం, జూన్ 6 (TV6 24/7 NEWS): కల్లూరు మండలం చంద్రుపట్ల గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘం నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణి డాక్టర్ సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నూతనంగా మత్స్య పారిశ్రామిక సంఘంలో నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని, గత ఎన్నికల్లో తమకు మంచి మెజారిటీతో గెలిపించినటువంటి ఈ గ్రామాన్ని మోడ్రన్ గ్రామంగా తీర్చిదిద్దుతామని, మొదటి విడతలో 32 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, 30 లక్షల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చామని, 200 పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఎన్నికలలో ఇచ్చిన మరి కొన్ని హామీలు ఉన్నాయని అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. నూతనంగా గుర్తింపు కార్డులు పొందినటువంటి మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ కల్లూరు మండల అధ్యక్షులు కోట్రు అర్జున్ రావు స్థానిక నాయకులు ఏఎంసీ డైరెక్టర్ లింగనబోయిన పుల్లారావు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.