ఖమ్మం టౌన్, జూన్ 13 (TV6 24/7 NEWS):
ఖరీఫ్ సీజన్ లో రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ తో పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు నాసిరకం గా ఉన్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.

శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో జరిగిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ కల్తీ, నాసిరకం విత్తనాలును పంపిణీ జరగకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తే రైతులు గోడు ఎవరికి చోప్పుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. అధికారులు కమీషన్ల కక్కుర్తి కోసం ఇలాంటి నాసిరకం విత్తనాలు సేకరించి రైతులకు సరఫరా చేయడం దారుణం అన్నారు.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట విత్తనాలు ధరలు పెంచడం వల్ల రైతులపై భారం పడుతుంది అని, ప్రభుత్వం డబ్బులు తీసుకుని నాసిరకం విత్తనాలు పంపిణీ చేయడం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె మీరా, దుగ్గి కృష్ణ, సహాయ కార్యదర్శులు గోడవర్తి నాగేశ్వరరావు, వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *