TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్,ఖమ్మం టౌన్, జూన్ 13. ఖమ్మం ఏఆర్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఈసీజీ, టూడీ ఈకో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిభిరాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ఆరోగ్యంగా ఉంటేనే విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారని, కుటుంబంలో ప్రశాంత ఉంటుందన్నారు. స్వీయ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

విధినిర్వహణలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, ప్రాణాంతక సమస్యలను ముందుగానే గుర్తించి నివారించడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమైన గుండె వైద్య పరీక్షలు ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలను యశోద వంటి ప్రముఖ ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, సిబ్బందికి ఈ ఆరోగ్య ప్రొఫైల్స్‌ను అందిస్తున్నాయట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ యశోద హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు భరత్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వినయ్ కుమార్, ఎస్బి ఏసీపీ మహేష్, ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్ సాంబశివరావు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *